చ‌నిపోయిన 117 రోజుల‌కు బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి

-

వైద్య చరిత్రలో ఒక్కోసారి అద్భుతాలు జరుగుతూంటాయి. అసాధ్యం అనుకున్న‌ది సుసాధ్యం అయితే అది నిజంగా పెద్ద చ‌రిత్రే అవుతుంది. తాజాగా యూర‌ప్ దేశంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ప్ర‌పంచంలోనే పెద్ద వింత‌గా ఉంది. ఈ సంఘ‌ట‌న‌లో ఓ వైపు సంతోషంతో పాటు మ‌రో వైపు విషాదం కూడా చోటు చేసుకుంది. వైద్య చ‌రిత్ర‌లోనే అద్భుతంగా నిలిచి ఈ ఘటనలో ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి చనిపోయింది. కానీ బిడ్డ బతికింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ తల్లి కాన్పులో సమస్య వచ్చి చనిపోలేదు. బిడ్డకు జన్మనివ్వక ముందే ఆమె చనిపోయింది.


ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. యూర‌ప్‌లోని జెఖియా దేశంలో 27 ఏళ్ల ఓ యువ‌తి బ్రెయిన్ డెడ్‌కు గురైంది. అప్ప‌టికే ఆమె గ‌ర్భ‌వ‌తిగా ఉంది. అయితే ఆ యువ‌తిని కోమా నుంచి కోలుకుంటుందేమో అన్న ఆశ‌తో డాక్ట‌ర్లు ఆమెను 117 రోజులుగా ఆక్సిజ‌న్ మాస్క్‌లో ఉంచి ప్రాణాలు కాపాడారు. అయితే ఆమె కోలుకోలేదు. చివ‌ర‌కు 117 రోజుల త‌ర్వాత ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇలా కృత్రిమ శ్వాసలో ఉండే ఆమె బిడ్డను ప్రసవించడం గమనార్హం. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా చెప్పొచ్చు.

ఇక గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడే ఆ యువ‌తి ఈ ఏప్రిల్‌లో తీవ్ర‌మైన అనారోగ్యానికి గురైంది. వెంట‌నే ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. ఆమెను బ‌తికించ‌లేమ‌ని వైద్యులు తేల్చిచెప్ప‌డంతో చివ‌ర‌కు కుటుంబ స‌భ్యులు బిడ్డను బతికించుకోవాలని భావించారు. త‌ల్లి బ్రెయిన్ డెడ్ అయినా తోప‌ల బిడ్డ ఆరోగ్యంగానే ఉండ‌డంతో డాక్ట‌ర్లు 117 రోజుల పాటు మాస్క్ ఆక్సిజ‌న్‌తో ఆమెను ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచి వైద్యులు చికిత్స చేశారు.

తాజాగా ఆ బ్రెయిన్ డెడ్ యువ‌తి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. సిజేరియన్ ద్వారా డాక్టర్లు బిడ్డకు ప్రాణం పోశారు. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. డెలివరీ పూర్తి కాగానే డాక్టర్లు ఆ యువతికి లైఫ్ సపోర్ట్ తీసేశారు. ఆ బిడ్డను తండ్రికి అప్పగించారు. వైద్య చ‌రిత్ర‌లోనే దీనిని ఓ అద్భుతంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది కీర్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version