పుదుచ్చేరిలో ఓ యాచకురాలు పోలీసులకు షాక్ ఇచ్చింది. చూసేందుకు ఏమీ లేని సాధారణ బిచ్చగత్తెలా కనిపించిన ఆమె వద్ద ఉన్న క్యాష్, అకౌంట్లో ఉన్న నగదు, చేతిలోని క్రెడిట్ కార్డును చూసి పోలీసులు ఖంగు తిన్నారు.
పుదుచ్చేరిలో ఓ యాచకురాలు పోలీసులకు షాక్ ఇచ్చింది. చూసేందుకు ఏమీ లేని సాధారణ బిచ్చగత్తెలా కనిపించిన ఆమె వద్ద ఉన్న క్యాష్, అకౌంట్లో ఉన్న నగదు, చేతిలోని క్రెడిట్ కార్డును చూసి పోలీసులు ఖంగు తిన్నారు. ఈ క్రమంలో వారు ఆమెను తన బంధువుల వద్దకు చేర్చారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
పుదుచ్చేరిలోని ఓ ఆలయం వద్ద సహాయం చేయాలని అర్థిస్తున్న ఓ యాచకురాలిని పోలీసులు విచారించారు. ఆమె పేరు పర్వతం (7) అని వారు తెలుసుకున్నారు. అంతేకాదు ఆమె వద్ద రూ.12వేల నగదు ఉందని, ఆమె బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు ఉన్నాయని, ఆమెకు ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా ఉన్నాయని గుర్తించారు. ఈక్రమంలో అవాక్కవడం పోలీసుల వంతైంది.
అయితే ఆ యాచకురాలిది తమిళనాడులోని కల్లికురిచి గ్రామం అని, ఆమె తన భర్త చనిపోవడంతో గత 8 సంవత్సరాలుగా సదరు ఆలయం వద్ద భిక్షాటన చేస్తుందని చుట్టు పక్కల వారు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను కల్లికురిచి గ్రామంలో ఉన్న ఆమె సోదరుడికి అప్పగించారు. ఇక ఆమె వద్ద అంత నగదు ఉన్నట్లు తమకు కూడా ఇప్పటి వరకు తెలియదని స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు మరొకసారి షాక్కు గురయ్యారు..!