పెళ్లి వేడుకలో విషాదం.. ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి..

-

కర్కశ హృదయుల పాశవిక చర్యతో ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బంధువుల పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 8 ఏళ్ల బాలికను అర్ధరాత్రి కళ్యాణ మండపం వద్ద కిడ్నాప్ కు గురైంది తెల్లవారుజామున చిన్నారి మృతదేహం కళ్యాణ మండపం వెనుకవైపు పడి ఉంది. వివ‌రాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో బంధువుల ఇంటిలో పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి ఐదు సంవత్సరాల చిన్నారి వర్షిణి వచ్చింది.

అలా పెళ్లికి వచ్చిన వర్షిణి ఆడుకుంటుండగా..దుండగులు అపహరించుకుపోయారు.. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంతగా వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. కూతురి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు ఈ రోజు ఉదయం చిన్నారి మృతదేహం లభించడంతో గొల్లుమంటూ కుప్పకూలిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి చిన్నారిని కిడ్నాప్‌చేసి అనంతరం గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని దూరంగా పడేసి వెళ్లిపోయారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version