చెట్టు ఒక్కటే.. పండేది మాత్రం ఆలుగడ్డ, టమాటా..!

-

అవును.. ఒకటే చెట్టు. కానీ.. రెండు రకాల కూరగాయలను అందిస్తుంది. వావ్.. ఇదేదో బాగుందే అంటారా? అవును.. గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఒకే చెట్టు నుంచి రెండు మూడు రకాల కూరగాయలను పండిచొచ్చు. ఈ విధానం ద్వారా ఎప్పటి నుంచో కూరగాయలను పండిస్తున్నారు. కాకపోతే.. చాలా తక్కువ మందికి దీనిపై అవగాహన ఉంటుంది. ఇలా గ్రాఫ్టింగ్ విధానంలో ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైతు కూరగాయలను పండించి ఔరా అనిపించాడు. గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టు విధానం అర్థమయిందా?

మన దగ్గర కాస్త తక్కువే కానీ.. విదేశాల్లో ఈ విధానాన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడ ఈ విధానాన్ని టామ్‌టాటో అంటారట. దుర్గ్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇలా కొత్త విధానంలో టమాటా, ఆలును పండించాడు. టమాటా హైబ్రిడ్ మొక్కలను తీసుకొని.. ఆలూకు సంబంధించిన మొక్కలను అంటుకట్టి ఒక హైబ్రిడ్ మొక్కను తయారు చేశాడు. తర్వాత దాన్ని భూమిలో నాటాడు. మూడు నెలల తర్వాత ఇలా ఆ చెట్టుకు కింద ఆలుగడ్డలు, పైన టమాటాలు కాసాయి. గ్రాఫ్టింగ్ ద్వారా టమాటాలు, వంకాయలను కూడా పండిస్తాడట ఆ రైతు.

Read more RELATED
Recommended to you

Exit mobile version