సరైన టైమ్‌లో స‌రితూగే ఆఫర్.. ఉచితంగా లీటర్ పెట్రోల్!

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై బీభత్సమైన చర్చ జరుగుతున్నది. లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలకు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఓ బేకరీ వినియోగదారులను ఆకర్షించడం కోసం ఓ బీభత్సమైన ఆకర్ష్ పథకం ప్రారంభించింది. తమిళనాడులోని కడలూరిలో ఉన్న ఓ బేకరీ షాపులోనే ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఇంతకీ ఆ బంపర్ ఆఫరేంటో చెప్పండహే.. అంటారా? ఆ ఆఫర్ ఏంటంటే.. కిలో కేక్ కొంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తారట. కాకపోతే కిలో కేక్ లేదంటే మినిమం రూ.495 రూపాయల బిల్లు చేయాలట. అదే షరతు. హే.. చాలా సింపుల్ షరతు పో.. కేకుకు కేకు పెట్రోల్‌కు పెట్రోల్ వస్తుంది కదా అని జనాలు కూడా ఆ బేకరీకి తెగ ఎగబడుతున్నారట. తమిళంలో రాసి ఉన్న ఓ యాడ్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంట సదరు బేకరీ నిర్వాహకులు. దీంతో ఆ యాడ్ కాస్త వైరల్‌గా మారడమే కాదు నెటిజన్లు కూడా ఆహా.. ఏం తెలివిరా మీది.. సరైన సమయానికి సరిపోయే ఆఫర్ ఇచ్చి వినియోగదారులను భలే ఆకర్షిస్తున్నారుగా. మీరు తోపులు పో.. అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఐడియా బాగుందంటారా? ఇటీవల ఇదే తమిళనాడులో ఓ యువకుడు కొత్త పెళ్లి జంటకు 5 లీటర్ల పెట్రోల్‌ను కానుకగా ఇచ్చిన విషయం మీకు గుర్తుంది కదా.. ఓకే ఓకే.. గుర్తుంటే పర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version