సాధారణంగా టీపౌడర్ ధర ఎంతుంటుంది? మా.. అంటే కిలోకు ఓ 300 లేదా 500. మరీ.. డిఫరెంట్ ఫ్లేవర్స్ పౌడర్ అయితే ఓ వెయ్యి. సరే.. డార్జిలింగ్.. ఇంకా ఏదేదో టీ పౌడర్ అంటారు కదా.. అదో రెండు వేలు ఉంటుందేమో. అంటారా? అవన్నీ ఓకేనండి. కానీ.. ఇప్పుడు మనం చదవబోయే టీపొడి కిలో ధర ఎంతుంటుందో చెబితే మీరు నోరెళ్లబెడతారు. ఆ తర్వాత కళ్లు తిరిగి కింద పడిపోతారు. అందుకే ముందు మీ పక్కన కొన్ని నీళ్లు పెట్టుకొని ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని ఈ వార్త చదవండి. మీరు కళ్లు తిరిగి పడిపోతే లేపడానికి ఒకరు కావాలి కదా అందుకే.
ఆ టీ పౌడర్ పేరు గోల్డెన్ నీడిల్స్ టీ. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న డోన్యి పోలో టీ ఎస్టేట్ నుంచి ఈ టీపౌడర్‌ను సేకరించారు. దాన్ని గౌహతిలో టీ యాక్షన్‌లో పెట్టారు. అప్పుడు దాన్ని ఎంత ధర పెట్టి కొనుక్కున్నారో తెలుసా? అక్షరాలా నలబై వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. వామ్మో.. అని నోరెళ్ల బెట్టకండి. కళ్లు తిరిగి పడిపోకండి. ఇంకా ఉంది చదవండి..
దీనికి ఎందుకింత ధర అంటే దీనిలో కొన్ని స్పెషాలిటీలు ఉన్నాయి. ఈ టీ పౌడర్ ఎలా ఉంటుందంటే.. చెట్ల నుంచి మొగ్గలను, ఆకులను వేరు చేస్తారట. వాటి ఆకులు అచ్చం బంగారం పూతలాగానే ఉంటాయట. ఎంతో మృదువుగా ఉంటాయట. ఇక.. వీటిని నీటిలో మరిగించినప్పుడు బంగారం కలర్‌లోకి నీరు మారుతుందట. ఇక.. వాసన కూడా ఎంతో మంచిగా రావడంతో పాటు మంచి టేస్ట్‌ను ఇస్తుందట ఈ టీ పౌడర్‌తో చేసిన టీ. ఒక్కసారి తాగితే.. మళ్లీ మళ్లీ తాగాలనిపించేలా దీని టీ ఉంటుందట. అందుకే.. దీన్ని అంత డబ్బులు పెట్టి మరీ కొనుక్కున్నారు.
ఇదివరకు జరిగిన టీ వేలంలో అస్సాం రకం టీ పొడి 39 వేలకు అమ్ముడుపోయిందట. అంతకు ముందు సిల్వర్ వైట్ టీ రకం పౌడర్‌ను రూ.17 వేలకు అమ్మారట. ఇక.. 40 వేలకు మాత్రం ఇంతవరకు ఏ టీ పౌడర్ అమ్ముడు పోలేదని.. ఇదే ఫస్ట్ టైమ్ అని టీ వేలం వేసే సభ్యులు తెలిపారు.