అక్కడ సంపన్న కుటుంబాల్లో వాళ్లు చనిపోతే ఏడ్వడానికి కిరాయికి మహిళలు వస్తారట..!!

-

మన అనుకున్న వాళ్లు మరణిస్తేనే కంట్లోంచి నీళ్లు ఆగవు. అలాంటిది కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడ్వకుండా ఉండగలరా చెప్పండి. ఆ సమయంలో మనం ఎంత హుందాగా ఉండాలి అనుకున్నఅది సాధ్యం కాదు. ఇక వారిని రోజూ చూడలేము అని తెలిశాక.. ఆ మృతదేహాన్ని పట్టుకోని గుండలవిసేలా ఏడుస్తారు. కానీ కొన్ని సంపన్న కుటుంబాలు వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ప్రతిష్ట తగ్గుతుందని భావిస్తారట. రాజస్థాన్‌లో అలాంటి ఒక సంఘం తక్కువ కులాల స్త్రీలను ఏడుపు కోసం నియమించుకునే ఆచారం ఉంది. ఏడ్వడం అనేది ఒక ఎమోషన్‌ వాళ్ల వాళ్లు చనిపోతే అది ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. ఇలా కులీలను పెట్టి ఏడిపించడడం ఏంట్రా..?

రుడాలి సంఘం స్త్రీల కన్నీట గాథ

ఊరిలో ఎవరైనా చనిపోతే నల్లటి దుస్తులు ధరించి మృతుడి ఇంటికి వెళ్లి ఏడ్చేవారు. పక్క ఇళ్లకు వెళ్లి మృతుడి నేపథ్యం తెలుసుకుంటున్నారు. తరువాత, వారు గుంపుగా శవం ముందు కూర్చుని మరణించిన నేపథ్యాన్ని వివరిస్తూ ఏడుస్తారు. ఛాతీకి కొట్టుకుని శవం ముందు రోదిస్తున్నారు.
అర్రే, థారో టు సుహాగ్ జియోర్ (ఓహ్, మీ భర్త ఇప్పుడు చనిపోయాడు) అంటూ.. వితంతువు చేతులు పట్టుకుని ఏడుస్తారు.

రుడాలి సంఘం ఏడ్చేందుకు పుట్టింది!

పశ్చిమ థార్ ఎడారి, రాజస్థాన్‌లో ఠాకూర్, రుడాలి కులాలు ఉంటాయి. ఠాకూర్ ఉన్నత కులం ప్రతిష్టాత్మకమైన కుటుంబం అయితే, రుడాలిది తరతరాలుగా కష్టాల్లో కూరుకుపోతున్న సమాజం. ఇక్కడి అగ్రవర్ణాలు రుడాలి సమాజం పుట్టింది ఏడుపు కోసమేనని నమ్ముతారు.

గౌరవప్రదమైన కుటుంబంలో కుటుంబ సభ్యులు చనిపోతే మహిళలు ఏడవరు. సామాన్య ప్రజల ముందు తమ భావోద్వేగాలను ప్రదర్శించకుండా తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అందువల్ల చనిపోయినప్పుడు ఏడవడానికి రుడాలి సమాజానికి చెందిన మహిళలను కిరాయికి తీసుకుంటారు.

నేటికి కొనసాగుతున్న ఆచారం..

ఇటీవల పెరుగుతున్న అక్షరాస్యత ఈ పద్ధతిని కొంతమేర తగ్గించింది కానీ పూర్తిగా ఆగలేదు. ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాలు ప్రాథమిక వృత్తిగా ఎవరైనా చనిపోతే ఏడ్వడమే వృత్తిగా చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version