కాంగ్రెస్ కి రాజీనామాపై పొన్నాల క్లారిటీ..!

-

తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది.. 45 ఏళ్ల తరువాత నేను తీసుకున్న నిర్ణయం చాలా బాధకరంగా ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మీకు తెలియనిది కాదు. జనగాం నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లను తీసుకొచ్చిన చరిత్ర తనదని తెలిపారు. 45 ఏళ్లలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అందులో వరుసగా మూడుసార్లు గెలిచిన బీసీ నేతను తానేనని..  అయినా తనపై  అవమానాలు జరుగుతున్నాయని తెలిపారు పొన్నాల. 

1983 నుంచి 2023 వరకు మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ కి 50 శాతం సీట్లు రాలేదని చెప్పినా వినే నాధుడే లేడు. పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ గురించి ఇప్పుడు తాను ఏమి మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. పదవుల కోసం రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చారు పొన్నాల లక్ష్మయ్య. 

Read more RELATED
Recommended to you

Exit mobile version