సాధారణంగా కొన్ని జంతువులు, పక్షులకు మనుషులతో అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మనుషులు కొన్నింటిని తమ ఇంట్లో పెంచుకుంటారు. కుక్క, పిల్లి, కోళ్లు, పావురాలు, బాతులు లాంటి వాటిని పెంచుకుంటుంటారు. అయితే.. కొందరికి వాళ్ల పెట్స్ తో విడదీయలేని బంధం ఉంటుంది. అవి లేకుంటే వాళ్లు ఉండలేరు. వాటితో అంత బాండింగ్ ఏర్పడుతుంది.
ఇక.. పెట్స్ కూడా మనుషులు చేసే పనులను చూసి అనుకరించడం… వాళ్లను పాలో అవడం చేస్తుంటాయి. అలా చేస్తుంటే చూసి కొందరు ముచ్చటపడుతుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే.
ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకురావాలంటే చెబితే కూడా కొన్ని పెట్స్ తీసుకురావడం చూసుంటాం. కానీ.. ఈ బాతు మాత్రం తన యజమాని కొడుకుకు భలే సాయం చేసింది. గుంతలా ఉన్న ప్రాంతంలో బాలుడి చెప్పు పడిపోయింది. బాలుడేమో అందులోకి దిగలేడు. భయపడిపోతున్నాడు. దీంతో బాతు వెంటనే కిందికి దిగి గుంతలో ఉన్న చెప్పును తీసి పైకి వేయబోయింది. అది ముక్కుతో నోట కరుచుకొని పైకి రావడానికి ప్రయత్నించడం.. మళ్లీ చెప్పు కిందపడిపోవడం.. ఇలా మూడునాలుగు సార్లు చెప్పు జారి కిందపడిపోయింది. అయినప్పటికీ… తన పట్టును మాత్రం ఆ బాతు వీడలేదు. చివరకు ఆ బాలుడి చెప్పును అతడికి అందించి బాలుడితో సహా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ బాతు చేసిన పనిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇది నిజంగా స్మార్ట్ డక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.