పర్సు కొట్టేస్తూ సీసీకెమెరాకు అడ్డంగా బుక్కయిన పాక్ ఆఫీసర్!

-

ఆయన దొంగ కాదు. సాదాసీదా మనిషి కూడా కాదు. పాకిస్థాన్ ప్రభుత్వాధికారి. ప్రభుత్వాధికారి అంటే ఏదో మామూలు అధికారి అనుకునేరు. పాకిస్థాన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫెసిలిటేషన్ జాయింట్ సెక్రటరీ. పెద్ద పోస్టే. రిచ్ పార్టీనే. పేరు జరార్ హైదర్ ఖాన్. కానీ.. బుద్ధే సరైంది కాదు.. దొంగ బుద్ధి కాదు. అదే ఇప్పుడు మనోడిని అడ్డంగా ఇరికించేసింది. ఎలా అంటే పాకిస్థాన్ దేశం పరువే పోయే విధంగా. అసలేంజరిగిందంటే..

ఇటీవల పాకిస్థాన్, కువైట్ దేశాల మధ్య ఓ మీటింగ్ జరిగింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ మీటింగ్ అన్నమాట అది. మీటింగ్ కు ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మీటింగ్ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. అందరూ వెళ్లిపోయారు. కానీ.. ఈ జరార్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. ఎందుకంటే మనోడికి అక్కడి టేబుల్ మీద పర్స్ కనిపించింది. దాని చూడగానే మనోడికి దొంగ బుద్ధి పుట్టింది. దాన్ని లటక్కున జేబులేసుకొని ఏం తెలియని నంగనాచిలా అక్కడి నుంచి తుర్రుమన్నాడు. అయితే.. ఆ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మనోడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

అరె.. నా పర్స్ కనిపించట్లేదు అంటూ కువైట్ కు చెందిన అధికారి మళ్లీ మీటింగ్ హాల్ కు వచ్చి టేబుల్ వద్ద చెక్ చూశాడు. అక్కడ కూడా కనిపించలేదు. దీంతో జరార్ ను ఆరా తీయగా.. తనకు తెలియదంటూ బుకాయించాడు. టేబుల్ దగ్గరే పెట్టి మర్చిపోయా అని ఆ అధికారి చెప్పడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు వాళ్లు. దీంతో దొంగ కాస్త బయటపడ్డాడు. పాక్ పరువు తీసినందుకు మనోడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారట. అది సంగతి. పాక్ బుద్ధి దొంగ బుద్ధని మరోసారి రుజువయింది కదా.

Read more RELATED
Recommended to you

Exit mobile version