చూశారుగా పైన ఫోటో… ఎలా ఉంది. అబ్బ.. గుడ్లు… వెంటనే లటక్కున నోట్లేసుకుందామా అని అంటారా? అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ రెండు గుడ్లలో ఒక గుడ్డు నిజమైనది కాదు. నిజమైనది కాదు అంటే పెయింటింగ్ అది. ఒకటి మాత్రమే నిజమైనది అంటే.. కోడి పెట్టిన గుడ్డు అన్నమాట. ఇప్పుడు చెప్పండి ఈ రెండు గుడ్లలో ఏది నిజమైనది.. ఏది పెయింటింగ్. చెప్పినవాళ్లను ఆ నిజమైన గుడ్డు ఫ్రీ. ఏంచక్కా ఆమ్లెట్ వేసుకొని తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ మెదడుకు పదును పెట్టండి. అందులో నిజమైన ఎగ్ ఏదో చెప్పండి. తర్వాత దాని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుందాం….
చెప్పండి.. గుర్తుపట్టారా? మీవళ్ల కావట్లేదా? దీన్నే హైపర్ రియలిస్టిక్ పెయింటింగ్ అని అంటారు. ఈ పెయింటింగ్ సృష్టికర్త జపాన్ కు చెందిన ఓ పెయింటర్ యాస్. ఆయనే ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. నిజమైన గుడ్డేదో గుర్తుపట్టండి చూద్దాం అని అడిగాడు. కానీ.. ఎవరూ అందులో నిజమైన గుడ్డేదో కనిపెట్టలేకపోయారు. గుడ్డే కాదు.. దేన్నయినా నిజమైన వస్తువుగానే పెయింటింగ్ వేయడం ఆయనకు కొట్టిన పిండి.
— Yas ヤス (@yasuta_kaii32I) October 27, 2018
సరే.. ఇవన్నీ ఓకే కానీ.. ఇందులో అసలైన గుడ్డు ఏదంటారా? కుడివైపు ఉన్నదే నిజమైన గుడ్డు. ఎడవ వైపు ఉన్నది పెయింటింగ్. కానీ.. కుడివైపుది కూడా నిజమైన గుడ్డులాగానే ఉన్నది కదా. ఇక.. ఈ ఫోటో జపనీస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.