![Sonakshi Sinha receives “piece of junk” instead of headphones, tweets about ordeal](https://manalokam.com/wp-content/uploads/2018/12/sonakshi-sinha.jpg)
ఆన్‌లైన్ మోసాలను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేస్తే వాటికి బదులు మరో వస్తువును పంపించడం.. అసలు అందులో ఆ వస్తువే లేకుండా పంపించడం కూడా మనం చూస్తున్నాం. అయితే.. ఈ ఆన్‌లైన్ మోసాల బారిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. దానికి ఉదాహరణే ఈ ఘటన.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాకు కూడా ఆన్‌లైన్ ఆర్డర్‌లో ఒక వస్తువుకు బదులు వేరే వస్తువు వచ్చింది. ఆమె 18 వేల రూపాయల విలువైన బోస్ హెడ్‌ఫోన్స్‌ను అమేజాన్‌లో బుక్ చేసింది. కానీ.. ఆమెకు డెలివరీ అయింది ఏంటో తెలుసా.. ఇనుప ముక్కలు. అవును తప్పు పట్టిన ఇనుప ముక్కలు ఆమెకు డెలివరీ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సోనాక్షి దాని ఫోటోను తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. అమేజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదంటూ మరో ట్వీట్ చేసింది. అప్పుడు మేల్కొన్న అమేజాన్.. క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. అది మ్యాటర్.