మనం ఊళ్లల్లో బస్ డ్రైవర్లు..బస్సు నడుపుతూ..ఏదో ఒక చోట జమకాయలు, బత్తాయిలు కొనుక్కోడానికో..దారిలో వాళ్లు ఇంట్లో వాళ్లు ఇచ్చే క్యారేజీ తీసుకోవాడనికో బస్సు ఆపుతుంటారు. రూల్ ప్రకారం అయితే ఇలా స్టాప్ లేకుండా ఆపకూడదు. కానీ వాళ్లు తినాలికదా..అని మనమూ లైట్ తీసుకుంటాం. ఇలానే పాకిస్థాన్ లో ఓ ట్రైన్ డ్రైవర్ ఏకంగా ట్రైన్ ఆపి పెరుగు ప్యాకెట్ తెప్పించుకున్నాడు. విషయం తెలిసిన రైల్వే శాఖ అతనిని సస్పెండ్ చేసింది. లాహోర్‌లో ఓ రైల్వే స్టేషన్‌కి దగ్గర్లో రైలు ఆపిన డ్రైవర్… తన అసిస్టెంట్‌తో పెరుగు ప్యాకెట్ తెప్పించుకున్నాడు. ఓ వీధిలో ఉన్న షాపులో పెరుగు ప్యాకెట్ కొన్న అసిస్టెంట్… నడుస్తూ వెళ్లి రైలు ఎక్కాడు.. అంతే ఆ ఘటన సర్వత్రా చర్చచు దారితీసింది. .
ఇలా ఇష్టమొచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ రైళ్లు ఆపుతారా… మీ వ్యక్తిగత అవసరాల కోసం రైలును ఆపేస్తారా అని ప్రయాణికులు ప్రశ్నించటం మొదలుపెట్టారు..ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుడంటంతో..దీనిపై పాకిస్థాన్‌లో పెద్ద దుమారమే రేగింది. రైల్వే శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంది అని నెటిజన్లు ప్రశ్నించడంతో… దీనిపై రైల్వే శాఖ దర్యాప్తు జరిపింది. రైలు ఆపినది రాణా మహ్మద్ షెహజాద్ అనీ… అతని అసిస్టెంట్ ఇఫ్తిఖార్ హుస్సేన్ అని విచారణలో తెలిసింది. వీడియోని చూసిన రైల్వే శాఖ మంత్రి అజామ్ ఖాన్ స్వాతి.. ఆ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ని సస్పెండ్ చేసేశారు..
ఈ ఘటనపై స్పందిస్తూ..రైల్వే శాఖ ప్రతినిధి సయ్యద్ ఇజాయ్ ఉల్ హస్సన్ షా ఏమన్నారంటే.. “మధ్యలో అలా రైలు ఆపేయడం అనేది రైల్వే రక్షణకు సమస్య.. ప్రయాణికుల రక్షణ మన మొదటి ప్రాధాన్యం. రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.” అని తెలిపారు.
ఎంత ప్రమాదమో..
రైలు కదలాలన్నా, ఆగాలన్నా అంతా స్టేషన్ మాస్టర్ల చేతిలో ఉంటుంది. వాళ్లే సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేస్తారు.. ప్రతీ స్టేషన్లో… ఏ రైళ్లు ఏ పట్టాలపై ఉన్నాయో… ఎంత వేగంతో ఉన్నాయో ఏ సమయానికి ఏ స్టేషన్‌కి రాగలవో చూపించే యంత్రాలుంటాయి. వాటి ఆధారంగా… స్టేషన్ మాస్టర్లు… రైళ్ల డ్రైవర్లకు ఆదేశాలు ఇస్తుంటారు. ఇక్కడ పెరుగు కోసం రైలును ఆపేయడం అనేది పెద్ద సమస్య. దీని వల్ల ఆ రూట్లలో వచ్చే ఇతర రైళ్ల వేగాలను మార్చాల్సి ఉంటుంది. ప్రయాణికులకు సేఫ్టీ ఎక్కడ ఉంది….. అందుకే ఈ అంశాన్ని అక్కడి అధికారులు అంత సీరయస్ గా తీసుకున్నారు.