జగన్ కాన్ఫిడెంట్ వెనుక అసలు కారణం అదేనా..? సెంటిమెంట్ రిపీట్ అవుద్దా..?

-

అధికారం కోల్పోయినా.. వైసీపీ అధినేత జగన్ ఎక్కడా బ్యాక్ స్టెప్ వెయ్యడం లేదు.. ముఖ్యనేతల్ని అరెస్టు చేసినా… కొందరు పార్టీ మారినా.. టీడీపీ మీద ఘాటైన విమర్శలు చేస్తూనే ఉన్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు.. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ.. తగ్గేదేలే అన్నట్లుగా ఉంటున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ బలంగా చెబుతున్నారు.. ఇంతకీ ఆయన కాన్పిడెంట్ కు కారణమేంటనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది.. అదేంటో చూద్దాం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే వైసీపీ అధినేత జగన్ జనాల్లోకి వచ్చారు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్ అరెస్టులు, విజయవాడ వరదలు, పిఠాపురం పర్యటనలు చేసి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఘాటుగానే విమర్శించారు.. ఇదే సమయంలో తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా జగన్ దూకుడుగానే స్పందించారు..

ముఖ్యమైన ఘటనలపై నేతలతో సమావేశాలు జరిపి.. వెంటనే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు పంపుతున్నారు.. జమిలి ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వస్తామని చాలా కాన్పిడెంట్ గా చెబుతున్నారు.. ఆయన కాన్పిడెంట్ కు కారణం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.. ఏపీని విభజించిన తర్వాత.. మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.. ఏ పార్టీకి ఇక్కడి ప్రజలు వరుసగా అవకాశం ఇవ్వలేదు.. 2014లో టీడీపీకి అధికారం అప్పగించిన ప్రజలు 2019లో ఆ పార్టీకి ఓడించారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది..

2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు చుక్కలు చూపారు..ఈసారి కూటమికి అవకాశం ఇచ్చారు.. పక్కగా సంక్షేమ పథకాలు అందించినా.. ప్రజలు ఆ పార్టీకి 11 సీట్లే ఇచ్చారు.. దీంతో ఈ మూడు ఎన్నికలను పరిశీలించిన వారికి ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది.. తమిళనాడు ప్రజలు ఇస్తున్న తీర్పును ఏపీ ప్రజలు కూడా ఇస్తున్నారని అర్దమవుతోంది..

ఒకసారి గెలిచిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం చేస్తున్నారు. సో.. ఈ ఫార్ములా ప్రకారం అయితే.. ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.. అందుకే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా పార్టీ బలోపేతం మీద దృష్టి పెడుతున్నారని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సిద్దంగా ఉండాలనే స్టాటజీతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ లోపు మళ్లీ ప్రజల జనాధరణ పొందాలని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version