తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణా చారి అనే వ్యక్తి పెంచుకుంటున్న కోడి నిజంగానే రోజుకో గుడ్డు పెడుతూ అతనికి బంగారం లాంటి ఆయాదాన్ని ఇస్తోంది.
బంగారు గుడ్లను పెట్టే బాతు కథ మీరందరూ వినే ఉంటారు. అందులో ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డును పెడుతుంది. దాన్ని అమ్ముకుని వ్యాపారి జీవిస్తుంటాడు. అయితే అన్ని గుడ్లు పెట్టే ఆ బాతు కడుపులో ఇంకాఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయోనని భ్రమపడే అతను దాన్ని చివరికి చంపి చూస్తూ దాని కడుపులో ఏమీ ఉండవు. దీంతో చివరికి ఆ వ్యక్తికి నిరాశే మిగులుతుంది. అయితే నిజంగా అలాంటి బంగారు గుడ్లను పెట్టే బాతులు ఉండవు కానీ.. బంగారం లాంటి ఆదాయాన్ని ఇచ్చే గుడ్లను పెట్టే కోడి మాత్రం ఒకటుంది. అదే.. ఎక్కడ ఉందంటే..?
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణా చారి అనే వ్యక్తి పెంచుకుంటున్న కోడి నిజంగానే పైన చెప్పినట్లుగా రోజుకో గుడ్డు పెడుతూ అతనికి బంగారం లాంటి ఆయాదాన్ని ఇస్తోంది. ఆ కోడి మొదటి విడతతో 30 రోజులకు 30 గుట్లు పెట్టి పొదగ్గా 25 పిల్లలు అయ్యాయి. తరువాత రెండో విడతలో వరుసగా 50 రోజుల పాటు 50 గుడ్లను పెట్టి పొదిగింది. దీంతో 45 పిల్లలు అయ్యాయి. అలా ఇప్పటి వరకు ఆ కోడి ఏకంగా 150 వరకు గుడ్లను పెట్టిందట. దీంతో గుడ్లను పొదిగించి పిల్లలు అయ్యాక అమ్మడం ద్వారా అతనికి ఏకంగా రూ.40వేల వరకు ఆదాయం కూడా వచ్చిందట.
అలా ఆ కోడి బాగా గుడ్లు పెడుతుండడం చుట్టు పక్కల అందరికీ తెలిసిందే. దీంతో ఆ కోడిని చూసేందుకు చాలా మంది ఆ వ్యక్తి ఇంటికి వెళ్తున్నారు. అయితే ఆ కోడి గురించి పశువైద్యాధికారులను అడగ్గా.. కొన్ని హార్మోన్ల ప్రభావంతో కోళ్లు ఇలా గుడ్లు పెడుతుంటాయని.. అది సహజమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా.. రామకృష్ణాచారి అదృష్టం మాత్రం బాగుంది. బంగారం లాంటి గుడ్లను పెట్టే కోడి దొరికింది..!