సీఎం సభలో చిన్నారి స్వెటర్ విప్పించారు… వీడియో

-

ఆందోళన, నిరసన, ధర్నా అంటే మనకు గుర్తొచ్చేందేంది… బ్లాక్ కలర్ కదా. అవును.. నల్ల రంగు నిరసనకు గుర్తు. అదే ఇప్పుడు అస్సాంలో వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి మీటింగ్ ఉందంటే సెక్యురిటీ అదీ చూడాలి కదా. అస్సాం సీఎం సర్బనందా సొనోవాల్ సభలోనూ అదే జరిగింది. ఆయన బిస్వంత్ లోని బోర్ గాంగ్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయన సభకు హాజరయ్యారు.

ఓ మహిళ తన కొడుకుకు నల్లటి స్వెటర్ వేసి సభకు తీసుకొచ్చింది. వాళ్లను గమనించిన భద్రతా సిబ్బంది… చిన్నారి వేసుకున్న నల్ల స్వెటర్ ను విప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అస్సాంకు చెందిన ప్రముఖ జర్నలిస్టు నందన్ ప్రతిమ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ ఘటన ముఖ్యమంత్రికి తెలియడంతో… ఈ ఘటనపై విచారణ జరిపించాలంటూ డీజీపీ కుల సైకియాకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. అస్సాంలో గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అస్సాం వాసులు. సీఎం సభకు కూడా నిరసనకారుల సెగ తగులుతుందేమనని.. ఇలా భద్రతా సిబ్బంది నల్ల రంగు డ్రెస్సులు వేసుకొని సభకు వచ్చే వాళ్ల డ్రెస్సులను ఇదిగో ఇలా విప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version