ముస్లింను ప్రేమిస్తావా.. అంటూ యువతిపై పోలీసుల వీరంగం..!

-

ఏంటో.. ఈ మధ్య అన్నీ ప్రేమ కథలు, కులాంతర వివాహాలు, పరువు హత్యలే సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడు మరో ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది.

ఓ హిందూ యువతి ముస్లిం యువకుడిని ప్రేమించింది. అతడితో కలిసి ఉన్న సమయంలో అఖిల భారత హిందూ మహాసభ నేతలు గమనించి వాళ్లను దూషించారు. ఆ జంటను నానామాటలు అన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆ జంటను పోలీస్ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ లేడీ పోలీస్ ఆ యువతిపై విరుచుకుపడింది.

నీకు హిందూ అబ్బాయి దొరకలేదా? ముస్లింను ప్రేమిస్తావా.. అంటూ మగ పోలీసులు ఆ యువతిని తిడుతుండగా.. ఆ మహిళా పోలీస్ యువతి తలపై బాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version