అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల తొలి అడుగు వేస్తుండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేసారు. అప్పుడే మొదటి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న ఏనుగు పిల్ల విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఏనుగు పిల్లను చూస్తే మీ మనసు పులకించిపోతుంది.
సాధారణంగా ఇలాంటి వీడియోలు ఎక్కువగా బయటకు రావు. అప్పుడే పుట్టిన ఏనుగుని చూడటం కూడా చాలా అరుదు. చిన్న క్లిప్‌లో, నవజాత ఏనుగు నిలబడి దాని పాదాలపై నడవడానికి ప్రయత్నిస్తుంది. అలా చేస్తున్నప్పుడు, అది ముందుకి పడుతుంది. అప్పుడు దాని బుల్లి తొండంతో అది పడకుండా ఆపుకుని మళ్ళీ నిలబడి నడవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఫిబ్రవరి 6 న సుసాంతా నందా 25 సెకన్ల క్లిప్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ఈ చిన్న దశతో వెయ్యి మైళ్ల ప్రయాణం ప్రారంభమవుతుంది” అని క్యాప్షన్‌లో రాశారు. నవజాత ఏనుగులు నిలబడటానికి ఒక గంట సమయం మరియు చుట్టూ తిరగడానికి మరికొన్ని గంటలు పడుతుందని ఆయన తన క్యాప్షన్ లో వివరించారు. ఏనుగు దూడలు పుట్టినప్పుడు 3 అడుగుల పొడవు ఉంటాయని అంటున్నారు. రాత్రి సమయంలోనే ఏనుగులు ఎక్కువగా జన్మనిస్తాయని అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.
A journey of a thousand miles begins with this small step.
Baby elephants take an hour to stand & a few more hours to waddle around.They are abt 3 feet tall at birth with 99% of birth taking place at night. pic.twitter.com/xJcmISgLXz— Susanta Nanda IFS (@susantananda3) February 6, 2020