వైరల్ వీడియో; చేప పొట్టలో ఏం ఉందో చూడండి…!

-

మనుషులు భూమిని అన్ని విధాలుగా నాశనం చేసారు అనేది వాస్తవం. ఏ విధంగా చూసినా సరే భూమి మొత్తాన్ని ప్లాస్టిక్ మయం చేసారు. దీనితో వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా జంతువుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక భారీగా ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రాలలో కలపడంతో అక్కడ ఉండే విలువైన మత్స్య సంపద అంతరించిపోతుంది. చేపలు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోతున్నాయి అనేది వాస్తవం.

ఈ నేపధ్యంలో బయటకు వచ్చిన వీడియో చేపలు ప్లాస్టిక్ ని ఏ స్థాయిలో మింగేస్తున్నాయో స్పష్టంగా చెప్తుంది. ట్విట్టర్ యూజర్ యాస్మిన్ స్కాట్ ఒక వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 1 నిమిష౦ 40 సెకన్ల వీడియో స్పెయిన్లోని కానరీ దీవుల టెనారిఫ్, ప్లేయా డి లాస్ అమెరికాస్ లో చిత్రీకరించారు. 35 ఏళ్ల మత్స్యకారుడు రెండు ఆక్టోపస్‌లు, ఒక చేపను పట్టుకున్నాడు. అయితే ఆ చేపలు విచిత్రంగా ఉండటాన్ని గమనించాడు.

చేప పొట్టను చీల్చి చూడగా దాంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఉంది. ఈ వీడియో పోస్ట్ చేయగా లక్షల కొద్దీ వ్యూస్ సాధించింది. వాటిలో ప్లాస్టిక్ ఉన్నా సరే నీళ్ళలో బ్రతికే ఉన్నాయని గుర్తించారు. చిన్న చేప కడుపులో ఇంత ప్లాస్టిక్ ఉంటే, తిమింగలం కడుపులో ఏ స్థాయిలో ప్లాస్టిక్ ఉంటుందో అసలు ఊహకు అయినా అందుతుందా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version