ప్రపంచంలోనే తొలి మహిళా రోబో న్యూస్ రీడర్.. వార్తలను ఎలా చదువుతోందో చూడండి..!

-

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లేదా కృత్రిమ మేథస్సు.. ఇది టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలను ఎలా తొక్కిస్తోందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ. ఇప్పటికే తొలి పురుష రోబో న్యూస్ యాంకర్ ను చైనాకు చెందిన జిన్హువా చానెల్ ఆవిష్కరించింది తెలుసు కదా. అదే చానెల్ ఇప్పుడు తొలి మహిళా న్యూస్ రీడర్ ను ఆవిష్కరించింది.

త్వరలోనే పురుష రోబో న్యూస్ యాంకర్ తో కలిసి వార్తలు చదవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆ మహిళా న్యూస్ యాంకర్ తెలిపింది. ఆ రోబోకు జిన్ జియామెంగ్ అని పేరు పెట్టారు. అదే చానెల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న ఓ లేడీ యాంకర్ రూపాన్నే ఈ లేడీ రోబోకు అమర్చారు. టెస్టింగ్ లో భాగంగా ఆ రోబో కొంచెం సేపు వార్తలు చదివి వినిపించింది. అది వార్తలు చదువుతుంటే అచ్చం మనిషి చదివినట్టుగానే ఉంది. అది రోబో అని కనిపెట్టడం అసాధ్యం. అది వార్తలు చదువుతుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version