దీనిపై విచారణ ప్రారంభించిన కోర్టు జొమాటో యాప్‌కు 55 వేల ఫైన్ విధించింది. 45 రోజుల్లో కస్టమర్‌కు ఆ డబ్బు చెల్లించాలని ఆదేశించింది. ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే మరో ఫుడ్ డెలివరీ చేసినందుకు 50 వేలు, మరో 5 వేలు కస్టమర్‌ను మానసికంగా హింసించినందుకు.. కట్టాల్సిందేనంటూ కోర్టు తీర్పునిచ్చింది.
ఈరోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌కు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఇంట్లో ఎవరు వండుకుంటున్నారు. అంతా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడమే. ప్రజల నాడిని పసిగట్టిన ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ కూడా అందినకాడికి దండుకుంటున్నాయి. అయితే.. చాలాసార్లు కస్టమర్లకు ఫుడ్ ఒకటి ఆర్డర్ చేస్తే మరో ఫుడ్ డెలివరీ చేసి యాప్స్ చాలాసార్లు పప్పులో కాలేశాయి. ఆ విషయంలో కస్టమర్‌తో ఒప్పందం చేసుకొని ఆ సమస్యను అక్కడే పరిష్కరించుకునేవి.
జొమాటో యాప్‌లో పూణెకు చెందిన ఓ వ్యక్తి పనీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాడు. కానీ.. డెలివరీ బాయ్ బటర్ చికెన్ మసాలా డెలివరీ చేశాడు. తప్పుడు ఆర్డర్ రావడం ఇదే మొదటిసారి కాదు.. రెండు సార్లు ఇలాగే జరిగింది. పనీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మాసాలా ఒకేలా ఉండటంతో ఆ వ్యక్తి దాన్ని తినేశాడు. ఆ తర్వాత తను చికెన్ తిన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ వ్యక్తి వెజిటేరియన్ కావడంతో.. చిర్రెత్తుకొచ్చింది. అసలే మనోడు లాయర్. వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేశాడు. వాళ్లు ఆర్డర్ డబ్బులను రిఫండ్ చేసినప్పటికీ.. తనతో చికెన్ తినిపించినందుకు వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారణ ప్రారంభించిన కోర్టు జొమాటో యాప్‌కు 55 వేల ఫైన్ విధించింది. 45 రోజుల్లో కస్టమర్‌కు ఆ డబ్బు చెల్లించాలని ఆదేశించింది. ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే మరో ఫుడ్ డెలివరీ చేసినందుకు 50 వేలు, మరో 5 వేలు కస్టమర్‌ను మానసికంగా హింసించినందుకు.. కట్టాల్సిందేనంటూ కోర్టు తీర్పునిచ్చింది.
దీనిపై స్పందించిన జొమాటో.. ఆ వ్యక్తి ఆర్డర్ చేసిన హోటల్ చేసిన తప్పిదమని వెల్లడించింది. కస్టమర్‌కు జరిగిన అసౌకర్యానికి తాము కూడా చింతిస్తున్నామని.. కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటామని.. ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా.. ఆ హోటల్‌ను తమ ఫుడ్ ఆర్డర్స్ లిస్ట్ నుంచి తప్పించినట్టు వెల్లడించింది.