Christmas Special Recipes : క్రిస్మస్‌ వేళ.. వంటలమాళ

-

క్రిస్మస్‌ పండుగ. క్రిస్టియన్లు జరపుకునే పండుగలు రెండే రెండు అవి క్రిస్మస్‌. ఇంకోటి న్యూఇయర్‌. క్రిస్మస్‌ సందర్భంగా ఇంట్లో వాళ్ళంతా చర్చ్‌కు వెళ్లి ప్రేయర్‌ చేస్తారు. తదనంతరం ఇంటికి తరిగి వస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వంటలు తయారు చేసి తీపి తినిపించుకుంటారు. ఆ సుభసందర్భంలో అందరిని తమ వంటలతో మైమరపించేలా చేసేందుకు మహిళలు ప్రత్యేక వంటలపై ఆసక్తి చూసుతారు. అంతగా ఆలోచించకుండా ఏవేవి చేస్తే బాగుంటుందో ముందుగానే ఆలోచించి మీకు కొన్ని రెసిపీలు అందిస్తున్నాం. వాటితోనే క్రిస్మస్‌ను ఎంజాయ్‌ చేయండి. హ్యాపీ క్రిస్మస్‌.

Kopta Biryani – కోప్తా బిర్యానీ

కావాల్సినవి :
చికెన్‌ లేదా మటన్‌ : అరకిలో
అల్లవెల్లుల్లి పేస్ట్‌ : 3 టీస్పూన్లు
తరిగిన కొత్తిమీర : అరకప్పు
గరంమసాలా : 2 టీస్పూన్లు
టమాటా కెచప్‌ : 2 టీస్పూన్లు
బాస్మతీబియ్యం : 2 కప్పులు
టమాటాలు : 3
జీలకర్ర : అరటీస్పూన్‌
గరంమసాలా : అర టీస్పూన్‌
ధనియాలపొడి : కొంచెం
పసుపు : అరటీస్పూన్‌
నూనె : అరకప్పు
ఉప్పు : తగినంత.
తయారీ :
ముందుగా స్టౌపై నాలుగు కప్పుల నీటిని వేడి చేయాలి. అందులో శుభ్రం చేసుకున్న బాస్మతీ బియ్యం వేయాలి. అరగంట తర్వాత ఉడికిన అన్నాన్ని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్‌లో అరకప్పు నూనె వేసి వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ధనియాలపొడి, కారం, పసుపు వేసి వేయించాలి. కాసేపటి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టాలి. కప్పు గోరువెచ్చని నీల్లు పోసి సిద్ధం చేసుకున్న చికెన్‌ ముక్కలు(కోప్తాబాల్స్‌) అందులో వేసుకోవాలి. కోప్తా ఉండలు ఉడికాయనుకున్నాక దించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని అడుగున నూనె రాసి ఉడికించిన అన్నం వేసుకోవాలి. మసాలా వేసి పొరలాగా వేసుకొని మళ్ళి అన్నాన్ని వేసుకోవాలి. పొయ్యి మీద పాన్‌పెట్టి ఈ గిన్నె పెట్టి అరగంట ఉంచితే ఎంతో రుచికరమైన కోప్తా బిర్యానీ రెడీ!

Read more RELATED
Recommended to you

Exit mobile version