శాంటాక్లాజ్ నిజంగా ఉన్నాడా..? ఆయనకు, క్రిస్మస్‌కు సంబంధం ఏమిటి..?

-

క్రిస్మస్ పండుగ అనగానే చిన్నారులకు కేకులు, క్రిస్మస్ ట్రీ, స్టార్లతోపాటు శాంటాక్లాజ్ తాత కూడా గుర్తుకు వస్తాడు. ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించి తమకు బోలెడన్ని గిఫ్టులను శాంటాక్లాజ్ తాత తీసుకువస్తాడని పిల్లలు ఎదురు చూస్తుంటారు. రాత్రి పూట ఇంటి గుమ్మం ఎదుట సంచుల్లో ఆయన గిఫ్ట్‌లను ఉంచి వెళ్లిపోతాడని కథలు చెబుతారు. అయితే శాంటాక్లాజ్ నిజంగానే ఉన్నాడా..? ఆయనది కల్పిత పాత్రా..? అంటే..

శాంటాక్లాజ్‌ది నిజానికి కల్పిత పాత్రే. అయినప్పటికీ ఆయన నిజంగానే ఉన్నాడని చాలా మంది నమ్ముతారు. అందుకు కారణాలూ లేకపోలేదు. 3వ శతాబ్దానికి చెందిన సెయింట్ నికోలస్‌కు శాంటాక్లాజ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉంటాయని చెబుతారు. ఇక సెయింట్ నికోలస్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, జాలి, దయ ఉన్నవాడిగా పేరుగాంచాడు. అతను కూడా శాంటాక్లాజ్ లాగా చిన్నారులకు గిఫ్టులను ఇచ్చేవాడట. అలాగే తన శక్తులతో ముగ్గురు చిన్నారులను ఆయన బతికించాడట. దీంతో ఆయనే శాంటాక్లాజ్ అని నమ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక శాంటాక్లాజ్ పెద్ద సంచి వేసుకుని అందులో చిన్నారులకు తాను ఇవ్వాల్సిన గిఫ్ట్‌లను వేసుకుని ఉత్తర ధృవం నుంచి వస్తాడని కొందరు చెబుతారు.

కాగా శాంటాక్లాజ్ గొర్రెల మందతో వస్తాడని కొందరు.. లేదు ఎలుగుబంటి వాహనంలో ఆకాశంలో ఎగురుతూ వస్తాడని కొందరు చెబుతారు. అయితే శాంటాక్లాజ్‌ను నిజంగా చూసినవారు కానీ, ఆయనచే గిఫ్టులు తీసుకోబడిన వారు కానీ ఎవరూ లేరు. ఇక శాంటాక్లాజ్‌కు, క్రిస్మస్‌కు సంబంధం ఏమిటా.. అని పరిశీలిస్తే.. నిజానికి జీసస్‌కు, శాంటాక్లాజ్‌కు మధ్య సంబంధం ఏమీ లేదు. కానీ ఇద్దరి జీవితాలకు కొంత పోలిక ఉంటుందని చెబుతారు. కొందరు శాంటాక్లాజ్ కూడా క్రీస్తులాగే దైవం అని నమ్ముతారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version