ఇలా మట్టి దీపాలను క్లీన్ చేసారంటే.. కొత్త వాటిల్లా మెరిసిపోతాయి..!

-

దీపావళికి మనం మట్టి ప్రమిదలను ఉపయోగిస్తూ ఉంటాము. మట్టి ప్రమిదల్లో నూనె పోసి వెలిగించి అందంగా ఇంటిని అలంకరిస్తాము. అయితే మట్టి దీపాలు నల్లగా ఉన్నట్లయితే… వాటిని ఇలా క్లీన్ చేసుకోండి. ఇక అవి తళతళా కొత్త వాటిల్లా మెరిసిపోతాయి. మట్టి ప్రమిదులను ఎలా క్లీన్ చేయాలి అనేది చూస్తే.. మట్టి కుందులకు జిడ్డు పేరుకు పోతుంది. వాటిని మెరిసేలా చేయడం కోసం ఒక టీ స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ ని కొద్దిగా వెనిగర్ ని వేసి క్లీన్ చేయాలి.

ఒక టూత్ బ్రష్ సహాయంతో మీరు వీటిని రుద్దచ్చు. ఇలా చేయడం వలన అవి మెరిసిపోతాయి నిజానికి కొత్తవాటిల్లా ఉంటాయి. అలాగే మీరు క్లీన్ చేసేటప్పుడు గిన్నెలో టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి అందులోనే వెనిగర్ వేసి రెండిటిని మట్టి కుందులకు అప్లై చేసి అలా కాసేపు వదిలేసి తర్వాత వాటిని రుద్దితే సులువుగా మురికి అంతా పోతుంది.

లేదంటే మీరు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం వేసి కుందుల్ని 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒకసారి వాష్ చేసేస్తే మొత్తం జిడ్డు మురికి పోతుంది. క్లీన్ గా కొత్త వాటిల్లా మారుతాయి. ఇలా ఈజీగా ఏ కష్టం లేకుండా సులువుగా మట్టి కుందులను క్లీన్ చెయ్యొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version