ఇందిరను యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి పొన్నం

-

ఇందిరాగాంధీని దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిర విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్న ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొనియాడారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత రోజుల్లో యువత, ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వృత్తి వ్యవహారపరంగా రాణిస్తున్నారంటే అది ఇందిరమ్మ చలవే అని అన్నారు. దేశ ఐక్యత, జాతీయ భావం, అభివృద్ధి, పేదల పట్ల పూర్తి శ్రద్ధ ఇలా అన్ని రకాల అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానిగా ఇందిరా గాంధీ నిలిచారన్నారు. అంతేకాకుండా, అత్యధిక కాలం దేశానికి ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి హైదరాబాద్ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version