దీపావళి పండగ వచ్చేస్తోంది. లక్ష్మీ పూజల కోసం వ్యాపారస్తులు అందరూ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. దీపావళి వస్తుందంటే.. ట్రేడింగ్ చేసేవాళ్లు బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రకటించే ట్రేడింగ్ ముహూర్తం కోసం ఎదురుచూస్తుంటారు.
సాధారణంగా దీపావళి పర్వదినం రోజున రెండు స్టాక్ ఎక్స్ చేంజెస్ కి సెలవు ఉంటుంది. కానీ దీపావళి రోజున ప్రత్యేకమైన ముహూర్తంలో గంటసేపు ట్రేడింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారు.
ప్రస్తుతం ఈ సంవత్సరానికి గాను దీపావళి సందర్భంగా ట్రేడింగ్ ముహూర్తం ఎప్పుడు ఉండనుందో బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రకటించేసింది.
నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 7గంటల వరకు ఉండనుంది. ముహూర్తంలో ట్రేడింగ్ చేయాలనుకునేవారు.. సాయంత్రం 6నుండి 7వరకు చేసుకోవచ్చు.
ట్రేడింగ్ ముహూర్తంలో ఎందుకు ట్రేడ్ చేయాలనుకుంటారు?
ఈ సమయంలో ట్రేడింగ్ చేస్తే మంచి జరుగుతుందని, ఈ సంవత్సరం మొత్తం లాభాల మార్గంలో పెట్టుబడులు సాగుతాయని నమ్మకం.
ఈ ముహూర్త సమయంలో ఈక్విటీ, కమాడిటీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూఛర్స్ అండ్ ఆప్షన్స్ వంటి సెగ్మెంట్లలో ట్రేడింగ్ చేయవచ్చు.