దీపావళి రోజు ఏ రాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలో తెలుసా?

-

దీపావళి… పేరులోనే ఉంది. దీపారాధన చేయడమే దీపావళి పండుగ అంటే. ఇంటి ముందు దీపాలను వెలిగించి… దీపాన్ని ఆరాధిస్తారు. దీంతో మనలో ఉన్న చెడును వెలుగు ద్వారా బయటికి పంపించి మంచిని గ్రహించడమన్నమాట. అయితే.. చాలామందికి వత్తుల విషయంలో సందేహాలుంటాయి. అసలు.. ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి అని.. సాధారణంగా కొంతమంది ప్రమిదలో రెండు వత్తులతో దీపం వెలిగిస్తుంటారు.

అయితే.. నిత్యం దీపారాధన చేసేవాళ్లయినా… గుడిలో, నది వద్ద, ఎక్కడైనా దీపారాధన చేయాలనుకునేవాళ్లు వాళ్ల జన్మ రాశిని బట్టి వత్తులు వెలిగించాలట. అయితే…. ఏ రాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలి అనే విషయాలన్నీ పురాణాల్లో స్పష్టంగా వివరించారట.

మేష రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి వారు 3 వత్తులు వెలిగించాలి. వృషభ, కన్య, కుంభ రాశి వాళ్లు 4 వత్తులు వెలిగించాలి. సింహ, వృశ్చిక, మీన రాశి వాళ్లు 5 వత్తులు వెలిగించాలి. తుల రాశి వాళ్లు 6 వత్తులు వెలిగించాలి. మిథున, మకర రాశి వాళ్లు 7 వత్తులు వెలిగించాలని శాస్త్రంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version