నటసింహం నందమూరి బాలక్రిష్ణ అల్లు వారి ఓటీటీ ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో, బాలయ్య లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఆహాలో ఈ షో కుసంబంధించిన ప్రీమియర్స్ ప్రస్తుతం ప్రసారమవుతున్నాయి. అయితే ప్రోమోలో అన్నగారు స్థాపించిన టీడీపీ పార్టీ పగ్గాలు తదనంతరం మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకిచ్చారు. అంటూ మోహన్ బాబు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ప్రశ్నకు బాలయ్య ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మా తెలుగు దేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి అతీతంగా అని బాలయ్య చెప్పారు. పెద్దాయన తరువాత మేము తీసుకుంటే ఇంకా దానికి అర్థం ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు గారు చాలా కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తి..ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుండి అన్ని చూసి వచ్చిన మనిషి అంటూ మోహన్ బాబు ప్రశ్నకు బాలయ్య ఆన్సర్ ఇచ్చారు.