సంక్రాతి నాడు ఇలా చేస్తే.. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది..!

-

హిందువులు జరుపుకునే పండగలలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ రోజున మకర సంక్రాంతిను జరుపుకుంటారు. అయితే దీనికి ఎన్నో రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఈ పండుగ సమయానికి రైతులకు పంటలు చేతికి వస్తాయి, దీంతో రైతులు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుందని అందరూ నమ్ముతారు. అంతేకాకుండా నదులలో స్నానం చేయడం వలన కూడా ఎంతో పుణ్యం వస్తుంది అని పండితులు చెబుతారు.

ప్రాంతాన్ని బట్టి ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ పండుగకు సంబంధించిన పూజలు చేయవచ్చు అని పండితులు సూచించడం జరిగింది. కొంతమంది భోగి సంక్రాంతి నాడు ఎంతో పవిత్రంగా భావించి దేవాలయాలకు వెళ్లడం లేక ఇంట్లో పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేస్తూ ఇంట్లో కేవలం శాఖాహారం మాత్రమే వండుతారు. కాకపోతే మరికొందరు సంక్రాంతి పండుగ రోజున మాంసాహారం ను వండుతారు. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని సంక్రాంతి పండుగ సమయంలో మాంసాహారం అసలు వండకూడదని అలా చేయడం వలన శుభ ఫలితాలు దక్కవని పండితులు చెప్పడం జరిగింది.

సంక్రాంతి పండుగ రోజున కేవలం పూజలు చేయడం మాత్రమే కాకుండా ఆ రోజు ఎన్నో దానాలు, ధర్మాలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా ఇలా చేయడంతో పూర్వీకులకు ఆత్మశాంతి అనేది లభిస్తుంది. ఎవరి శక్తి సామర్థ్యాలు ప్రకారం వాళ్లు తోచిన దానం చేయడం వలన ఎన్నో మంచి శుభ ఫలితాలను పొందుతారు. కనుక పండుగ రోజున ప్రశాంతంగా ఉండాలని కోరుతూ దానాలు చేసి కోటి జన్మల పుణ్యం పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news