అక్కడ పురుషులు చీరలు కట్టుకొని అలా చెయ్యాలట..ఎందుకో తెలుసా?

-

మన దేశంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. నిన్నటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు.ఒక్కో ప్రాంతంలో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి.. అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయంలో, తొమ్మిది రోజుల నవరాత్రి పండుగలో ఎనిమిదవ రాత్రి ఓ వింత ఆచారం కొనసాగుతుంది. నవరాత్రి సమయంలో గుజరాత్‌లో ‘గర్బా’ నృత్యం చేయడం ఆనాదిగా వస్తోంది. సంప్రదాయ బట్టలు ధరించిన మహిళలు అమ్మవారి పాటలపై గర్బా ప్రదర్శిస్తుంటే, పురుషులు కూడా వారితో నృత్యం చేయడం కనిపిస్తుంది. అయితే అహ్మదాబాద్‌లో కూడా 200ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అక్కడి పురుషులు చీర కట్టుకుని గర్బా చేస్తారు..

ఇది వినడానికి వింతగా ఉన్నా కూడా అక్కడ ప్రతి ఏటా పురుషులు నృత్యం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో నివసించే ‘బారోట్ కమ్యూనిటీ’ ప్రజలు ‘సదుబా మాత’ను పూజిస్తారు. అష్టమి రోజున ఇక్కడి పురుషులు చీరలు ధరించి గర్బా చేస్తారు. ఇది బారోట్ కమ్యూనిటీ ప్రజలు దేవత పట్ల తమ కృతజ్ఞతను తెలియజేసే సంప్రదాయం..గత 200 ఏళ్ళ నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది.

ఒకప్పుడు సదుబా’ అనే మహిళ చాలా సంవత్సరాల క్రితం బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు తన గౌరవాన్ని కాపాడటానికి సహాయం చేయడానికి నిరాకరించినప్పుడు వారికి శాపం ఇచ్చిందని చెబుతారు. ఈ క్రమంలో ఆమె తన బిడ్డను పోగొట్టుకున్నట్లు సమాచారం. ఆమె శాపం ఇప్పటికీ శక్తివంతమైనదని స్థానికులు నమ్ముతున్నారు. ఆమెను శాంతింప జేయడానికి, ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడ పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెను క్షమాపణ కోరతారు. పురుషులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి చీర కట్టులో అమ్మవారి ముందు నృత్యం చేసి,వారి పిల్లల ఆయువు పెరిగేందుకు ప్రార్థిస్తారు.అప్పుడే వాళ్ళు నూరేళ్లు చల్లగా ఉంటారని వారి నమ్మకం..

Read more RELATED
Recommended to you

Exit mobile version