సూర్యాపేట జిల్లా ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్.. కలకలం రేపుతోంది. కోదాడ మండలం నెమలిపురి ఎస్సి గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. రెండు రోజుల క్రితం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహంచారు. అయితే… పార్టీలో మద్యం తాగి ఘర్షణకు దిగారట పది మంది విద్యార్థులు.
ఈ తరుణంలోనే… ఆ విద్యార్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట యాజమాన్యం. విద్యార్థులను మందలించడంతో ఎవరికి చెప్పకుండా పరార్ అయ్యారట ఆరుగురు విద్యార్థులు. దీంతో…. ఎక్కడికి వెళ్ళారో తెలియక భయాందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అటు కోదాడ రూరల్ పొలీసులకు ఫిర్యాదు చేశారు ప్రిన్సిపాల్ ఝాన్సీ.