ఏపీ హడావిడి…నేడు మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు

-

ఏపీ ప్రజలకు అలర్ట్. నేడు మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్‌లు, మూడు కార్పొరేషన్‌లకు, డిప్యూటీ మేయర్‌లతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్‌ పదవులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేటర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు.

Elections will be held today for the posts of chairmen of three municipalities, deputy mayors of three corporations, in Andhra Pradesh.

తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్‌లో 2 డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక అటు హిందూపూర్ పట్టణంలో హై అలర్ట్‌. హిందూపూర్ పట్టణంలో 144 సెక్షన్ & సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు. మున్సిపల్ ఎలక్షన్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ ఆదేశించారు. హిందూపురంలో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం దిశగా ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version