స్ట్రాబెర్రీలను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా..?

-

స్ట్రాబెర్రీ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన బెర్రీ పండు. స్ట్రాబెర్రీలు తినేందుకు రుచిగా కూడా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయగలవు తెలుసా..? ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి..కాలరీలు చాలా తక్కువ.. వీటిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపరు.. కానీ ఇవి మీరు తరచూ తింటుంటే.. మీ ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. స్ట్రాబెర్రీలను షుగర్‌ పేషెంట్స్‌ తినొచ్చా..? ఇవి తియ్యగా ఉంటాయి కదా..! మరి తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా..?

స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్ట్రాబెర్రీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు సహజ తీపితో ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలో ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే, ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహ నియంత్రణలో ఇది మరొక ముఖ్యమైన అంశం.

స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండవచ్చు. స్ట్రాబెర్రీ యొక్క శోథ నిరోధక ప్రభావాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయం. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రాబెర్రీలు “చెడు” LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు సమతుల్య ఆహారంలో భాగంగా స్ట్రాబెర్రీలను తినవచ్చు. అలాగే స్ట్రాబెర్రీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోండి, కాబట్టి వాటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version