ఛాతిలో మంట ఇబ్బంది పెడుతున్నప్పుడు ముట్టుకోకూడని ఆహారాలు.

-

ఆహారమే ఆరోగ్యం. ఇందులో ఎలాంటి సంశయం లేదు. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యం ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. అందుకే ఎలాంటి ఆహారాలు దేనికి మంచివి అనేవి తెలుసుకోవాలి. అలాగే ఏ ఆహారాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయనేది కుడా తెలిసి ఉండాలి. ప్రస్తుతం ఛాతిలో మంట ఇబ్బంది పెడుతున్నప్పుడు ముట్టుకోకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం.

అసలు ఛాతిలో మంట ఎందుకు కలుగుతుంది?

కడుపులో ఉన్న ఆహారం అన్నవాహికలోకి వచ్చినట్టుగా అనిపించి తిలో మంట వస్తుంది.  లక్షణాలు

ఛాతిలో మంటగా ఉండడం,
గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించడం,
శరీరం ఉబ్బడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.

ఇలాంటి ఇబ్బందులు అనుభవంలోకి వచ్చినపుడు ముట్టుకోకూడని కొన్ని ఆహారాలేంటో చూద్దాం. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే పడుకోకూడదు. ఆహారం తిన్నాక కనీసం రెండు గంటల పాటైనా మెలకువగా ఉండి ఏదైనా పనులు చేస్తే బెటర్.

స్పైసీ ఆహారాలు

కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు గానీ, సుగంధ ద్రవ్యాలతో కూడిన ఆహారాలను గానీ ఎక్కువగా ముట్టుకోకూడదు. ఒకానొక అధ్యయనం ప్రకారం, సుగంధ ద్రవ్యాల ఆహారాలు త్రేన్పులకు కారణంగా ఉంటున్నాయని తెలిసింది.

పండ్లు, కూరగాయలు

కొన్ని పండ్లు, ముఖ్యంగా ఫైనాఫిల్, నారింజ, గ్రేప్ ఫ్రూట్, నిమ్మకాయ, టమాట, ఉల్లిగడ్డ, వెల్లుల్లి మొదలైనవి పక్కన పెట్టడమే మంచిది.

పానీయాలు

ఆల్కహాల్, కాఫీ, టీ, కార్బోనేటెడ్ పానీయాలు, టమాట రసం మొదలైనవి ముట్టుకోవద్దు.

ఎక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు

ఫ్రెంచ్ ఫ్రైస్, బాగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు, బంగాళదుంప చిప్స్, వెన్న, చిక్కటి పాలు, ఛీజ్, ఐస్ క్రీమ్, ఎక్కువ కొవ్వు ఉండే సలాడ్లు, క్రీమ్ సాస్, ఎక్కువ కొవ్వు ఉండే మాంస పదార్థాలు పక్కన పెట్టాలి.

చాక్లెట్

చాలామంది త్రేన్పులకి కారణం చాక్లెట్ అయ్యుంటుంది. అందుకే వెంటనే మీకిష్టమైన ఆహారాల్లోంచి దాన్ని తీసేయండి.

ఐతే ఈ ఆహారాలు తీసుకున్నప్పుడు మీ శరీరం ఎలా స్పందిస్తుందనేది గమనించండి. ఆ తర్వాత మీకేమీ అర్థం కాకపోతే వైద్యుడిని సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version