కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా…? అయితే వీటిని తినండి…!

-

చాలా మంది కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే వేయించుకుని ఉంటారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంత మందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.

అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండాలంటే మీ డైట్ లో వీటిని తీసుకోండి. కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మంచి డైట్ ను తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. మరి వాటి కోసం చూద్దాం.

ఆకు కూరలు:

డైట్ లో ఆకుకూరల్ని తీసుకోవడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక మీరు మీ డైట్ లో ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి.

సూప్:

కూరగాయలు ఇమ్యూనిటీని పెంచుతాయి. సూప్ చేసుకుంటే రుచిగా, సులువుగా తినొచ్చు. దానితో పాటుగా సూప్ లో మనం వివిధ రకాల మసాలా దినుసులని వేస్తాము. దీనితో ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి వీలవుతుంది.

ఉల్లి మరియు వెల్లుల్లి:

ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి కనుక ఇవి కూడా సహాయం చేస్తాయి.

పసుపు:

పసుపులో యాంటి ఇన్ఫెక్షన్ గుణాలు మరియు యాంటీ స్ట్రెస్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయ పడతాయి పైగా ఒత్తిడి సమస్యను కూడా దూరం చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version