సండే స్పెషల్.. పెప్పర్ చికెన్ డ్రై తయారు చేద్దామా?

-

అసలే ఇవాళ సండే. నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగుతుందా దిగదు కదా. అది కూడా రొటీన్ గా ఎప్పుడూ వంటే ఐటమ్సేనా? కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తే ఎలా ఉంటది. అబ్బో భలేగుంటది అంటారా? అయితే పదండి.. సండే స్పెషల్ పెప్పర్ చికెన్ డ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

పెప్పర్ చికెన్ డ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? చికెన్ ముక్కలు, ఉప్పు, పెప్పర్ పొడి(మిరియాలు), యోగర్ట్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నగా పొడవుగా తరిగిన పచ్చి మిర్చి, గరమ్ మసాలా, కరివెపాకు, ధనియాల పొడి, జిలకర్ర పొడి, టమాట గుజ్జు, కొత్తిమీర ఉంటే చాలు పెప్పర్ చికెన్ డ్రై తయారు చేయొచ్చు.

తయారు చేయు విధానం

ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగండి. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి, దాంట్లో యోగర్ట్, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఓ అర్ధగంట పాటు అలాగే ఉంచండి. ఇంతలో పాన్ లో ఇంత నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. బాగా వేగాక… దాంట్లో కరివెపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించండి. అనంతరం మిగిలిన పెప్పర్ పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. తర్వాత దాంట్లో టమాటా గుజ్జు వేసి బాగా కలపండి. ఒకవేళ టమాటా గుజ్జు పాన్ కు అంటుంకుందని అనుకుంటే కొన్ని నీళ్లు పోయండి. టమాటా గుజ్జు బాగా వేగాక… ఇదివరకే కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేయండి. చికెన్ ముక్కలను బాగా కలపండి. మసాలాతో కలిసేలా తిప్పండి. కాసేపు చికెన్ ఉడికాక… కొంచెం నీళ్లు పోయండి. మూత పెట్టి కాసేపు చికెన్ ను ఉడకనీయండి. కాసేపు ఉడికాక… కరివెపాకు, కొత్తిమీర వేయండి. మంట తక్కువ పెట్టండి. పది నిమిషాల తర్వాత మంట కట్టేయండి. అంతే.. వేడి వేడి పెప్పర్ చికెన్ డ్రై రెడీ. దీన్ని అన్నంతో కానీ.. అలాగే కానీ… రోటీలతో కానీ లాగించేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version