ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో కావ్య థాపర్ ఖతర్నాక్ లుక్స్

-

‘ఏక్‌ మినీ కథ’, ‘బిచ్చగాడు 2’,  సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది నటి కావ్య థాపర్. తాజాగా ఈ బ్యూటీ మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. రవితేజకు జోడీగా ‘ఈగల్‌’లో సందడి చేసింది కావ్య. కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ మరో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం కావ్య ఈగల్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు అటెండ్ అవుతోంది. ఇందులో భాగంగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తోంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్సులో కావ్య బంగారంలా మెరిసిపోయింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కావ్య అందానికి మెస్మరైజ్ అవుతున్నారు. సో బ్యూటీఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version