ఉల్లిపొరలాంటి చీరలో జాన్వీ కపూర్.. నీ అందం చూసి కుర్రకారు బేజార్

-

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ మరోసారి చీరకట్టులో కనువిందు చేసింది. ఈసారి ఉల్లిపొర లాంటి ట్రాన్స్​పరెంట్ శారీలో సందడి చేసింది. బవాల్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా జాన్వీ ఈ లుక్​లో కనిపించింది. చీరకట్టులో ఈ భామ భలే ముద్దుగా ఉంది. ప్రస్తుతం జాన్వీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరలో జాన్వీ భలే అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా శారీలో అమ్మాయిల అందమే వేరు బాసూ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ బ్యూటీపై తమ ప్రేమనంతా హార్ట్, ఫైర్ ఎమోజీస్​తో కురిపించేస్తున్నారు.

ఇక జాన్వీ సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ వరుణ్ ధావన్​తో కలిసి బవాల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఇదే కాకుండా మిస్టర్ అండ్ మిసెస్ మాహీ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్​లో జూనియర్ ఎన్టీఆర్​తో కలిసి దేవర అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version