డయబెటీస్ ఉన్నవారు.. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవడం వారి ప్రాథమిక కర్తవ్యం. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఆహారందే ముఖ్యమైన పాత్ర. మనం తినే ఆహారమే షుగర్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో..బాదం, డ్రై ఫ్రూట్స్ వీళ్లకు చాలా హెల్ప్ అవుతాయి. బాదంతో బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది.. మధుమేహం మాట వింటుంది. షుగర్ పేషంట్స్ బాదంను ఎలా వాడాలో చూద్దామా..!
బాదంపప్పును రోజూ తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. షుగర్ అదుపులో ఉండాలంటే బాదంపప్పును పాలతో కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయట. యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. మెగ్నీషియం బాదంలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
బాదంపప్పును తీసుకోవడం ద్వారా బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిక్ డైట్లో చేర్చగలిగే ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో బాదం ఒకటి. బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. బాదంపప్పు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది.
బాదం పాలు…
రోజూ 7-8 బాదంపప్పులు తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు జరుగుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్ గుణాలు బాదంలో ఉంటాయి. బాదంపప్పును పాలతో కలిపి తీసుకోవడం వల్ల దాని శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయి. పాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారంగా బాదం పాలను తీసుకుంటే, వారి షుగర్ నియంత్రణలో ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
అయితే దాదాపు డయబెటిక్ ఉన్నవాళ్లు అంతా లావుగానే ఉంటారు. ఇలా పాలు బాదం తినడం వారికి మంచిదే..అయితే వీళ్లు డైట్ మీద ఇంకాస్త ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పెరిగే బరువును వేరే వాటిని కట్ చేయడం వల్ల బ్యాలెన్స్ చేసుకోవచ్చు. !
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.