రాజధాని పై మా విధానం అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా : బొత్స సత్యనారాయణ

-

మూడు రాజధానిలనేది ఆ రోజుకు తయ విధానం అని, రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని శాసన మండలి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు రాజకీయ లబ్ది కోసం మాట్లాడారని అన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ తాత్కాలికం అని గత ప్రభుత్వం తెలిపిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు.

అధికార పార్టీకే పని చేయాలని సాక్షాత్తూ సీఎం మాట్లాడడం తగదన్నారు. స్వాతంత్రం వచ్చాక ఏ సీఎం ఈ తరహా లో మాట్లాడలేదని తెలిపారు. రుషికొండలో అవినీతి జరిగిందంటున్నారు. అయితే రుషికొండ
కట్టిన కాంట్రాక్టర్ కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలని కోరారు. రుషికొండ లో అవినీతి అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ జరపాలన్నారు. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమరావతి శ్మశానంలా ఉందని తాను ఆరోజు వ్యాఖ్యానించిన మాట వాస్తవమే అన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడా అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version