బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్…!!!

-

చాలా మంది బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అంటూ రోజూ కడుపు మాడ్చుకుని, ఇష్టం లేని ఫుడ్స్ తింటూ ఇష్టం ఉన్న వాటిని దూరం పెడుతూ వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది తినాలన్నా భయమే ఎక్కడ బరువు పెరిగిపోతారోనని. ఉదయాన్నే లేచి వ్యాయామాలు అంటూ పరుగులు పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా సులభంగా బరువు తగ్గచ్చు అంటున్నారు ఆస్ట్రియా శాస్త్రవేత్తలు.

బరువు తగ్గాలని అనుకునే వారు ఒకరోజు తిని మరొక రోజు తినకుండా ఉంటే చాలు అంటున్నారు. అంటే రోజు విడిచి రోజు తినాలి. అయితే ఇదేదో సాదా సీదాగా ఉపవాసం ఉండండి అని చెప్పింది కాదట. అందుకు వీళ్ళు పెద్ద ప్రయోగమే చేశారట. ఇలా రోజు విడిచి ,రోజు తినడం వలన కలిగే ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో భాగంగా బరువు సుమారు 60 మందిని ఎంపిక చేసి వారికి నాలుగు వారాల పాటు రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేలా చేశారట. వారితో పాటే మూడు నెలల ముందు నుంచీ మరో 30 మందితో ఇలాంటి అధ్యయనమే చేశారట. ఆ తరువాత ఉపవాసం అలవాటు లేని వారి ఆరోగ్యంతో పోల్చి చూశారట. దాంతో రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేవారు ఎక్కువగా క్యాలరీలు కోల్పోతున్నారని తేలిందట. దాంతో బరువు తగ్గాలని అనుకునే వారు తప్పకుండా ఈ విధానం పాటిస్తే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటున్నారు ప్రొఫెసర్ ఫ్రాంక్ మడియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version