పెరుగులో ఉప్పు కలిపి తినేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు

-

భోజనంలో ఎన్ని కూరలు, ఎన్ని వెరైటీలు ఉన్నా.. ఫినిషింగ్‌ టచ్‌ కర్డ్‌ రైస్‌ పడాల్సిందే. పెరుగు అన్నం తినకపోతే.. ఎంత తిన్నా ఏదో వెలితిగా ఉంటుంది. పెరుగు అన్నంతో అరటిపండు, మామిడి, ద్రాక్ష, దానిమ్మ ఇలా ఏదో ఒకటి కాంబినేషన్‌తో తినడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఇవన్నీ టేస్టీగా ఉంటాయి కానీ.. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. సరే ఇవన్నీ డైలీ ఉండకపోయినా.. పెరుగుతో ఉప్పు అయితే కచ్చితంగా అందరూ వేసుకుంటారు. ఉప్పు లేకుండా పెరుగు అన్నం తినలేరు. కానీ దీనిపై వైద్యులు ఏం అంటున్నారు..? ఇలా తినొచ్చా లేదా తెలుసుకుందాం.

పెరుగులో విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం ఉండటం వల్ల ఆరోగ్యానికి అది మంచి ఫుడ్ అని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు ఆహారాన్ని రుచిగా మార్చుతుంది. కాబట్టి పెరుగులో కొద్ది మొత్తంలో కలుపుకుంటే ఫర్వాలేదు. కొంతమంది వైద్యులు రాత్రిపూట పెరుగులో చిటికెడు ఉప్పును జోడించమని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పెరుగు ఎసిడిక్ కాబట్టి పెరుగుతో పాటు ఉప్పు ఎక్కువగా తింటే పిత్త (Bile), కఫ (Phlegm) సమస్య పెరుగుతుంది. బైల్, కాలేయం ఉత్పత్తి చేసే పైత్యరసం/ద్రవం. ఇది కొవ్వులను జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కఫం అనేది శ్వాసనాళాల ద్వారా ఉత్పత్తి అయ్యే మందపాటి శ్లేష్మం. పిత్తం, కఫం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం కావడం, సరిగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే మంచి బ్యాక్టీరియా. మితంగా తింటే పెరుగు చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం. అలానే అధిక ఉప్పు అనారోగ్యకరమైనది. హై బీపీ ఉన్నవారికి ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవడం అస్సలు మంచిది కాదు.

షాప్‌లో కొనుగోలు చేసిన పెరుగులో ఎక్కువ కొవ్వు ఉండదు, కానీ ఓవర్ ఫెర్మెంటేషన్ కారణంగా ఇంట్లో ఫ్రీజ్ చేసిన పెరుగులో కొవ్వు ఏర్పడుతుంది. పెరుగును ఫ్రీజ్ చేసినప్పుడు, అది ఉప్పు నీటిని విడుదల చేస్తుంది, అంటే అది అప్పటికే ఉప్పును కలిగి ఉంటుందనమాట. కాబట్టి దీనికి ఉప్పును ఎక్కువగా చేర్చడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ప్లైన్ కర్డ్ తినడం ఆరోగ్యకరమైనది, లేదా రుచి కోసం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు.

ఆయుర్వేద ఏం చెబుతోంది?

రాత్రిపూట పెరుగు తినకూడదని, దాంట్లో ఉప్పు కలపకూడదని ఆయుర్వేదం చెబుతోంది. పెరుగు, ఉప్పు కలిపి తినడం వల్ల జుట్టు నెరిసిపోవడం, చర్మంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version