రేషన్ షాపుల్లోని కొన్ని ప్రాంతాల్లో సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. శనివారం సర్వర్ సమస్యతో బియ్యం కోసం వచ్చి సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు సమాచారం.సర్వర్ పనిచేయకపోవటంతో పలు ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అరగంట నుంచి సర్వర్ మొరాయించడంతో బియ్యం పంపిణీని ఆపేశారు. దీంతో రేషన్ కార్డుదారులు చౌక ధరల దుకాణాల వద్ద నిరీక్షిస్తున్నారు.విషయం తెలియడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు సర్వర్ సమస్యను వెంటనే పరిశీలించి క్లియర్ చేయడంతో రేషన్ దుకాణాల్లో యథావిధిగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.