భద్రాచలం ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.34 కోట్లు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి తుమ్మల చొరవతో నిధులు విడుదల జరిగింది. భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇక అటు నేటి నుంచి ఒంటిమిట్టలో శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. రేపు శ్రీ రామనవమి సందర్భంగా ధ్వజారోహణ జరుగనుంది. ఈ నెల 11న ఒంటిమిట్ట కోదండ రాములవారి కళ్యాణోత్సవం ఉంటుంది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.