మీరు అధిక ప్రోటీన్స్ ఫుడ్ తింటున్నారా.. అయితే జాగ్రత్త..!

-

మన తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సాధారణంగా ఒక ఆరోగ్యావంతమైన వ్యక్తికి తన ఒక్కో కేజీ బరువుకు ఒక్క గ్రామ్ ప్రోటీన్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

ప్రోటీన్స్ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మన చర్మం సాగుదలకు ఉపయోగపడే కొల్లాజెన్ ను కాపాడడానికి ప్రోటీన్ చాలా అవసరం.జుట్టు పెరుగుదలకు, కండర పుష్టికి, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, ముఖ్యంగా అథ్లెట్స్ తక్షణ శక్తికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్స్ ఎక్కువగా మాంసంలోనూ, చిరుధాన్యాల్లోను, గుడ్లులోనూ అధిక ప్రోటీన్ ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ ఆడేవారు, బాడీ బిల్డర్స్, బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలను తీసుకుంటువుంటారు.అయితే కొంతమంది అవగాహనా లోపంతో ప్రోటీన్స్ ఫుడ్ అధిక మొతాదులో తీసుకొని అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటూ ఉంటారు.

ప్రోటీన్ల దుష్ప్రభావాలు:
మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్లు చాలా తక్కువగా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.వాటిలో ఒకటి లేదా రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు లేకపోవడం వల్ల జంతు ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. మాంసాహారాలు అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలతో పాటు అధిక కొవ్వుల తో నిండి ఉంటాయి. మాంసాహారం లో లీన్ మరియు తక్కువ కొవ్వు ఉండే రకాలైన మాంసాహారాలను ఎంచుకుంటే ఎటువంటి హాని ఉండదు. కానీ అధిక కొవ్వులు ఉండే ముఖ్యంగా రెడ్ మీట్ వంటి ప్రోటీన్ ఆహారాలను ఎంచుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి కరోనరీ హార్ట్ డిసీజ్,టైప్ 2 మధుమేహం,గుండెపోటు వంటి వివిధ గుండె రుగ్మతలు,కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

అవే కాక,నోటి నుండి దుర్వాసన,తలనొప్పి,మలబద్ధకం,
కడుపు ఉబ్బరం,కిడ్నీ సమస్యలు అధికమవుతాయి. కొంతమంది ప్రోటీనలను సప్లిమెంట్ల రూపంలో కృత్రిమంగా తీసుకుంటూ ఉంటారు.అవి మంచి చేయకపోగా ఎన్నో దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఆహారం విషయంలో సొంతం వైద్యం కాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సూచనలను పాటిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version