సమ్మర్ ఫ్రూట్స్ అంటే.. మామిడి, పుచ్చకాయే మనకు మైండ్లోకి వస్తాయి. వీటిని ఈ ఎండాకాలంలో జనాలు విపరీతంగా తింటారు. ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు చాలా మంచివి. అయితే చాలామంది.. పుచ్చకాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తింటారు. తినాలనిపించినప్పుడు కట్ చేసుకుని చల్లగా తింటుంటే.. హాయిగా ఉంటుంది.. మీరు అలానే చేస్తున్నారా..? కానీ ఇలా పుచ్చకాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టి తినడం మంచిది కాదంటున్నారు వైద్యులు.
పోషకాలు ఉండవు..
నిజానికి పుచ్చకాయలో చాలా పోషకాలు ఉంటాయి. పుచ్చకాయం తినడం వల్ల వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు. ఇందులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇంకా.. ప్రొటీన్లు, విటమిన్లు, పీచు వంటి అనేక పోషకాలు ఉంటాయి. పుచ్చకాయలో ఉండే పీచు ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి బరువు సులువుగా బరువు తగ్గవచ్చు. కానీ మీరు పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. దాని బయటి భాగం చాలా మందంగా ఉంటుంది. దీని కారణంగా పుచ్చకాయ త్వరగా చెడిపోదు. సుమారు 15-20 రోజులు ఉంటుంది. అందుకే దీనిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పుచ్చకాయని కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. అలాగే కెరోటినాయిడ్ స్థాయి కూడా తగ్గిపోతుంది.
చల్లని పుచ్చకాయ అస్సలు తినకూడదు..
పుచ్చకాయ ఎండాకాలంలో ఉపశమనాన్ని ఇచ్చే నీటి పండు. అయితే ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. అలాగే చల్లని పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. దీంతో పాటు చాలా సమయం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ తింటే ఫుడ్-పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందట.
కాబట్టి ఎప్పుడూ కూడా.. పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టి తినడం మంచిది కాదు. పుచ్చకాయే కాదు.. చాలామంది అవసరం లేకున్నా పండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అంతేకాదు..అరటిపండు, మామిడికాయను పెరుగు అన్నంలో కలిపి తినే అలావాటు మన తెలుగోళ్లకు ఏళ్లనాటి ఉంది. ఇలా కూడా తినడం అంత మంచి పద్దతికాదని వైద్యులు ఎప్పుడూ చెప్తుంటారు.