వారానికి మూడుసార్లు నాన్‌వెజ్‌ లాగించేస్తున్నారా..? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

-

భోజనం చేసే విషయంలో ఒక్కొక్కరిదో ఒక్కో రకమైన అభిరుచి. కొందరు మసాల ఆహారాలనే ఎక్కువగా తింటారు. వారానికి కనీసం మూడు రోజులు అయినా నాన్‌వెజ్‌ ఉండాల్సిందే. ఇంకొందరు.. కేవలం ఆదివారం మాత్రమే నాన్‌వెజ్‌ తింటారు. ముక్కలేనిదే ముద్ద దిగదు అనే బ్యాచ్‌కు ఒక షాకింగ్‌ న్యూస్‌. ఎవరైతై మాంసాహారం అతిగా తింటారో.. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినేవారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగా ఉందని తేలింది.

BMC మెడిసిన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం..8 సంవత్సరాలలో బ్రిటన్‌లో దాదాపు 4,75,000 మంది మధ్య వయసు గల వారి ఆరోగ్య రికార్డులను పరిశీలించింది. దీని ప్రకారం, వారానికి కనీసం మూడు సార్లు ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, పౌల్ట్రీ (కోడి, టర్కీ వంటివి) తినే వ్యక్తులకు తొమ్మిది రకాల వ్యాధుల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మాంసాహారం గుండె జబ్బులకు దారితీస్తుందట. ప్రాసెస్ చేయని ఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుందని తెలిపారు.

మాంసాహారంలో ఉండే సంతృప్త కొవ్వు ఆమ్లాల వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె సమస్యలకు దోహదం చేస్తుంది. ఈ అధ్యయనం మాంసం వినియోగం మధుమేహం మధ్య సంబంధాన్ని కూడా వెల్లడించింది. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసం రోజువారీ వినియోగం మధుమేహం ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుంది.

మాంసం నిజానికి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు. కానీ వాటిని మితంగా తీసుకోవాలి. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని రోజుకు 70 గ్రాములకు పరిమితం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే వివిధ రకాల ఆహారాన్ని తినడంపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. సంతృప్త కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి.

మాంసం తినే వాళ్లలో కూడా తేడాలు ఉన్నాయి..

ఈ అధ్యయనానికి పరిమితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మంసాన్ని బాగా ఉడికించి తింటారు. మరికొందరు నూనెలో బాగా వేయించి.. ఆయిల్ ఫుడ్ తీసుకుంటారు. దీని ద్వారా మాంసం ద్వారా వచ్చే ప్రభావాలు వ్యక్తి నుంచి వ్యక్తికి తేడా ఉంటాయి. ఇనుము, జింక్, విటమిన్ బి 12 వంటి అవసరమైన పోషకాలను పొందడానికి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version