చందాలు వసూలు చేసేందుకే…అమెరికాకు బండి సంజయ్ – రవీందర్ సింగ్

-

చందాలు వసూలు చేసేందుకే…అమెరికాకు బండి సంజయ్ వెళ్లాడని చురకలు అంటించారు సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలంటూ గతంలో కేసు వేసివ బండి సంజయ్ ది బ్లాక్ మెయిల్ బతుకు అని… ఫేక్ కేసులతో బండి సంజయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.

ravinder singh slams bandi sanjay

కేసు పెట్టి… ఎవిడెన్స్ ఇచ్చేందుకు కోర్టుకు హాజరు కానీ బండి సంజయ్ కు కోర్టు 50 వేల జరిమానా విధించిందన్నారు. బండి సంజయ్ కు ఎంపీగా కొనసాగేందుకు అర్హత లేదు… వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తప్పుడు కేసు కాబట్టే బండి సంజయ్ కోర్టుకు రాలేదని ఆగ్రహించారు. అవినీతి ఆరోపణల కారణంగానే బండి సంజయ్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు….చందాలు వసూలు చేసేందుకే బండి సంజయ్ అమెరికా పోయాడని ఎద్దేవా చేశారు. మోసపు మాటలతో గెలిచి నియోజకవర్గాన్ని పట్టించుకోని బండి సంజయ్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version