జీర్ణ సమస్యల మొదలు డయాబెటిస్ వరకు సొరకాయతో మాయం..!

-

మనం రెగ్యులర్ గా సొరకాయని ఏదో ఒక దానిలో వేసి వండుతూ ఉంటాం. సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ మరియు పాలీఫినాల్స్ కూడా ఉంటాయి. అయితే సొరకాయ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

జీర్ణ సమస్యలు ఉండవు:

సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను తొలగిస్తుంది. అలానే ఇంకా బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా ఉండవు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

సొరకాయ డైట్ లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీంతో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ మొదలైన సమస్యలు తొలగిపోతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో సమృద్ధిగా ఉంటాయి.

డయాబెటిస్ వాళ్లకి మంచిది:

డయాబెటిస్ వాళ్లకి సొరకాయ మంచిది. ఇందులో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది.

బరువు తగ్గొచ్చు:

బరువు తగ్గడానికి కూడా మనకి సొరకాయ బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాములు సొరకాయలో 17 క్యాలరీలు ఉంటాయి. ఖాళీ కడుపున సొరకాయ రసం తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది.

కంటి ఆరోగ్యానికి మంచిది:

కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నైట్ బ్లైండ్నెస్, ఐ డ్రైనెస్ వంటి సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది. అదేవిధంగా సొరకాయల లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ కూడా ఉంటాయి. అంతే కాదు సొరకాయ తీసుకోవడం వలన కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రావు ఇలా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version