Grooming tips: వానా కాలంలో మగవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

-

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అదే విధంగా ఎక్కువగా వానలో తడవడం వలన చర్మానికి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే వానా కాలంలో మగ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రూమింగ్ టిప్స్ ని కనుక పాటిస్తే ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.

 

క్లీన్ షేవ్ లేదా ట్రిమ్ చేయడం:

మీరు రెగ్యులర్ గా ట్రిమ్ చేయడం లేదా మీ గడ్డంని క్లీన్ షేవ్ చేయడం మంచిది. ఎందుకంటే వానా కాలంలో దుమ్ము, ధూళి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి. చెమట తో పాటు ఇవి కలిసిపోయి ముఖానికి ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి క్లీన్ షేవ్ చేయడం లేదు అంటే ట్రిమ్ చెయ్యడం మంచిది.

షాంపూని వాడండి:

గడ్డం క్లీన్ చేయడానికి beard shampoo ఉపయోగించండి. ఈ షాంపూ ని ఉపయోగించడం వల్ల దుమ్ము, ధూళి, చెమట పూర్తిగా తొలగిపోతాయి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను కూడా అప్లై చేయండి ఇలా చేయడం వల్ల దురద వంటివి రావు.

ఆల్కహాల్ లేని లోషన్ వాడండి:

షేవింగ్ చేసిన తర్వాత చర్మం డ్రైగా అయిపోతుంది. దీంతో అన్ కంఫర్టబుల్ గా ఉంటుంది కనుక షేవింగ్ చేసిన తర్వాత ఆల్కహాల్ లేని లోషన్ ను అప్లై చేసుకోండి. ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది.

షేవ్ చేసే ముందు ఎక్స్ప్యాలియెట్ చేయండి:

ఎక్కువ చెమట, నూనె ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఎక్స్ప్యాలియెట్ చేయడం వల్ల చెమట, జిడ్డు తొలగిపోతాయి ఆ తర్వాత స్మూత్ గా మీరు షేవ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version